కాంగ్రెసు తెలంగాణ నేతలపై దుమ్మెత్తిపోసిన కె. చంద్రశేఖర రావు

K Chandrasekhar rao
హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మంత్రులపై, శాసనసభ్యులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. మెదక్ జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సోమవారం తెరాసలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలంతా ఒక్కటవుతుంటే కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులకు, మంత్రులకు సిగ్గు వస్తలేదని, మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. 8 వేల మంది విద్యార్థులపై ప్రభుత్వం కేసు పెట్టిందని, కేసుల ఎత్తివేత కోసం తమ పార్టీ శాసనసభ్యులు పోరాడుతుంటే కాంగ్రెసు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. మంత్రి జానా రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మాలని జానా రెడ్డి అంటున్నారని, జానారెడ్డికి సిగ్గులేదని ఆయన అన్నారు. తాము రాజీనామా చేస్తామని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగి రాదా అని ఆయన అడిగారు.

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అని చెప్పుకుంటున్న కాంగ్రెసు నాయకులు విద్యార్థులపై కేసులు ఎత్తివేయించడంపై మాట్లాడడం లేదని, సిగ్గు ఉంటే కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన 24 గంటల లోపలే సీమాంధ్ర జీవులంతా ఒక్కటై 24 గంటలు కూడా మన సంతోషాన్ని ఉంచలేదని, తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు దద్దమ్మలని, అందుకే తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటై ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన అన్నారు. డిసెంబర్ 31వ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ ప్రజలు ఒక్కటవుతున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+