కృష్ణా జిల్లా సంక్షోభంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మంతనాలు

పేర్ని నాని పార్టీలోనే ఉంటానని చెప్పారని, కేవలం జగన్ తో పాటు కలిసి రైతులను మాత్రమే కలుస్తానని చెప్పినట్టు ముఖ్యమంత్రికి మంత్రి పార్థసారధి చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం రైతుల సమస్యలపై కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న జగన్ యాత్రలో పాల్గొంటానని, తన కార్యకర్తలు, అభిమానులు జగన్ వెంట వెళ్లాలని సూచించినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత మంత్రి పార్థసారథి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. జగన్ వెంట వెళ్లనప్పటికీ ఇప్పటికే అసంతృప్తులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్, మాజీ కౌన్సిలర్లు జగన్ వెంట వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications