అక్బురుద్దీన్ శిఖండిలా వ్యవహరిస్తున్నారు: కెటి రామారావు

తెలంగాణ ఉద్యమాన్ని మలినం చేసే విధంగా అక్బరుద్దీన్ వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పైగా గాంధీ పేరును కూడా ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన మేరకు విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని తాము కోరుతుంటే అక్బరుద్దీన్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులు నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లి నర్సులను కొట్టలేదని, దాడులు చేయలేదని, తుపాకులు పట్టుకుని బెదిరించలేదని ఆయన అక్బరుద్దీన్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ విద్యార్థులపై ప్రేమ ఉంటే విద్యార్థులపై అన్ని కేసులను ఎత్తేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications