స్పీకర్, బన్సల్ హామీతో లగడపాటి రాజగోపాల్ మౌనదీక్ష విరమణ

అంతకు ముందు ఢిల్లీలోని పార్లమెంటు భవన్ లో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సంచలనం సృష్టించారు. అకాల వర్షాలకు, అతి వృష్టికి, వరదలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన సోమవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంటు భవన్ దీక్షకు దిగారు. రైతు సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, స్పీకర్ మీరా కుమార్ కు లేఖలు రాశారు. రైతు సమస్యలను పరిష్కరించే వరకు తాను దీక్ష విరమించేది లేదని మొండికేశారు. రైతు సమస్యలపై లోకసభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం మధ్యాహ్నం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత కూడా లగడపాటి రాజగోపాల్ బయటకు రాలేదు. పార్లమెంటు భవన్ లోనే ఆయన మౌనదీక్ష చేస్తున్నారు. ఫోన్ చేసినా ఆయన మాట్లాడడం లేదు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. లగడపాటి రాజగోపాల్ తో దీక్ష విరమింపజేయడానికి ఎఐసిసి నాయకులు రాయబారాలు నడుపుతున్నారు.












Click it and Unblock the Notifications