ఎన్నో కేసులు ఎత్తేయలేదా: నాగం జనార్దన్ రెడ్డి, హరీష్ రావు

కేసులను రెండు విభాగాలుగా విభజించడంలో అర్థం లేదని తెదేపా శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. అన్నీ అక్రమ కేసులే అయినప్పుడు రెండు విభాగాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం వల్ల విద్యార్థులు తమ చదువులను, జీవితాన్ని ఫణంగా పెట్టవలసి వస్తుందన్నారు. వంగవీటి రంగ, ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో హత్య కూడా చేయబడ్డారు. అయినప్పటికీ ఆ కేసులన్నీ ఎత్తివేశారని గుర్తు చేశారు. కేసులు పెట్టబడిన విద్యార్థుల్లో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బిసీలేనన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపైనే ఎస్సి, ఎస్టీ కేసులు పెట్టాడం విడ్డూరమన్నారు.
ప్రభుత్వం కేసుల ఎత్తివేత నిర్ణయం కొండను తవ్వి ఎలుకను తీసినట్లుగా ఉందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ఈ ప్రకటన కోసం సంవత్సరం తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు విద్యార్థులు సంఘటనా స్థలం వద్ద లేకున్నప్పటికీ వారిపై కేసులు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయడానికే మాత్రమే కేసులు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ లీగల్ సమస్య అంటున్నారని అయితే రంగా, పరిటాల విషయాలేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా చాలా కేసులు ఎత్తివేశారన్నారు. హోంమంత్రి ప్రకటన ప్రకారం ఎత్తివేసిన కేసులు 25 శాతమేనన్నారు. ఈ కేసులు ఎత్తివేయడానికి 2 రోజులుగా ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతుంది.












Click it and Unblock the Notifications