భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టిన టెక్కీ

Dehra Dun Murder Case
డెహ్రాడూన్: డెహ్రాడూన్ లో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్యను హత్య చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను రెండు నెలల పాటు ఫ్రిజ్ లో దాచినట్లు పోలీసులు ఆదివారం చెప్పారు. 38 ఏళ్ల బాధితురాలు అనుపమా గులాటి సోదరుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. తన సోదరి ఎక్కడుందనే విషయంపై ఆమె భర్త నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుపమ గులాటి భర్త రాజేష్ (37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన అతను డెహ్రాడూన్ లోని ప్రకాష్ విహార్ లో ఉంటున్నాడు.

తన భార్యను అక్టోబర్ 17వ తేదీన హత్య చేసినట్లు రాజేష్ విచారణలో అంగీకరించాడు. భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగిందని, ఈ సమయంలో రాజేష్ అనుపమ తలను గోడకేసి కొట్టాడని, దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయిందని, తీవ్రమైన కసితో అతను ఆమె గొంతు కోశాడని, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని, వాటిని డీప్ ఫ్రిజ్ లో పెట్టాడని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ జిఎస్ మార్టోలియా చెప్పారు. అమ్మ ఢిల్లీకి వెళ్లిందని అతను తన కవల పిల్లలిద్దరికీ సర్దిచెబుతూ వచ్చాడు. భార్యతో సంబంధాలు మెరుగు పడ్డాయని అనుపమ సోదరుడు సుజన్ కు అతను చెబుతూ వచ్చాడు. అయితే, అనుమానంతో సుజన్ శనివారం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుపమ, రాజేష్ 18 నెలల క్రితం వచ్చి డెహ్రాడూన్ లో స్థిరపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+