దిగి రాని తెరాస శాసనసభ్యులు: మరోసారి అసెంబ్లీ వాయిదా

ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని, మిగతా కేసుల ఎత్తివేత దిశగా ప్రభుత్వం సాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి అంతకు ముందు చెప్పారు. దశలవారీగా కేసుల ఎత్తివేత చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. కేసులు ఎత్తేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. జానారెడ్డి మాటలను తెరాస సభ్యులు ఖాతరు చేయలేదు. తిరిగి సభ సమావేశమైన తర్వాత పరిస్థితి అదుపులోకి రాలేదు. తెరాస సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సభను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications