అదే గందరగోళం, కేసుల ఎత్తివేతపై పట్టు: అసెంబ్లీ వాయిదా

విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాల్సిందేనని తెరాస సభ్యులు పట్టుబట్టారు. అల్లరి చేయడం సరి కాదని, సభను సాగనివ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ప్రధానమైన రైతుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయినా వారు వినలేదు. సభ గౌరవాన్ని, సంప్రదాయాన్ని కాపాడాలని డిప్యూటీ స్పీకర్ మనోహర్ సూచించారు. సభను జరగనివ్వాలని ఆయన సూచించారు. అయినా తెరాస సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications