కిరణ్ కుమార్ కు షాక్: అసంతృప్తులకు వైయస్ జగన్ గాలం

YS Jagan
హైదరాబాద్: కృష్ణా జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న రాజకీయాలతో అధికార కాంగ్రెసు పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. ఇప్పటికే వైయస్ జగన్ వైపు వెళ్లేవారు ఎవరనే విషయం నిర్ధారణ అయిందని భావిస్తున్న తరుణంలో శాసనసభ్యుడు పేర్ని నాని, కృష్ణా జిల్లాలోని పలువురు నాయకులు సంచలన ప్రకటనలు చేస్తూ వైయస్ జగన్ వైపు వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. రైతులను పరామర్సించే నెపంతో జిల్లా పర్యటనకు వచ్చిన వైయస్ జగన్ తన వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. తవ తండ్రి ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చడానికి వైయస్ జగన్ ఇష్టపడడం లేదని ఆయన వర్గం చెబుతున్న మాటలు వ్యూహాత్మకమైనవేనని, ప్రభుత్వాన్ని చీల్చరు గానీ 2014లోపలే వీలైతే అధికారాన్ని చేపట్టడానికి వైయస్ జగన్ పావులు కదుపుతున్నారని ఊహించలేకపోయారని అంటున్నారు.

వైయస్ జగన్ శిబిరానికి చెందిన నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ వైపు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న నాయకులతో వైయస్ జగన్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లా పరిణామాలు బయటకు కనిపిస్తున్నప్పటికీ ఇతర జిల్లాలోనూ లోలోపల చురుగ్గా పావులు కదులుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో పి. జనార్దన్ రెడ్డి కుమారుడు, శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డితో వైయస్ జగన్ అనుచరులు మాట్లాడినట్లు సమాచారం. తనను పార్టీ సమావేశాలకు పిలవకపోవడం పట్ల, తనను గుర్తించకపోవడం పట్ల ఆయన విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లాలో సంచలనాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలోనే విశాఖపట్నం జిల్లాలో సబ్బం హరి, కొణతాల రామకృష్ణ సమావేశమై వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ఖరారు చేశారు. వైయస్ జగన్ తరఫున కరుణాకర్ రెడ్డి లోపల విస్తృతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చిత్తూరు జిల్లాలో మండలాలవారీగా నాయకులతో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో వైయస్ జగన్ వర్గీయులు ముమ్మరంగా పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా వారికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న శాసనసభ్యురాలు కుతూహలమ్మను కూడా తమ వైపు తిప్పుకునేందుకు వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. జిల్లాలవారీగా వైయస్ జగన్ ఆకర్ష్ పథకం పకడ్బందీగా అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+