వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రస్తుతానికి కాంగ్రెసుతోనే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Perni Nani
మచిలీపట్నం: తనను గెలిపించిన కాంగ్రెస్‌లో నైతిక విలువలకు కట్టుబడి 2014 వరకు మనసు చంపుకొని కొనసాగుతానని మచిలీపట్నం శానససభ్యుడు పేర్నినాని అన్నారు. వైయస్ జగన్ తో వెళ్లడానికి నిర్ణయించుకున్న ఆయన ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్న సాకుతో రాజధానిలో ఉండడం, ఇంట్లో కూర్చోని లేడని చెప్పించడం తమకు అలవాటు లేదని, అలాంటి స్వభావం కాదని వ్యాఖ్యానించారు. తనను గెలిపించిన కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2006లో బందరు వచ్చారని, మున్సిపాల్టీలోని పరిస్థితిని చూసి సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసం తాను అడగకుండానే రూ.10 కోట్లు ఇచ్చారన్నారు. ఇదే అభిమానంతో వైఎస్‌ జగన్‌కు మద్దతు పలికామని చెప్పారు.

అనంతరం పేర్నినాని అంబటి రాంబాబుతో రహస్య మంతనాలు జరిపారు. అనంతరం కోనేరు సెంటర్‌వద్ద జగన్‌ మద్దతుదారుడు, కాంగ్రెస్‌ పార్టీ బహిష్కృత నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామంది నానీలున్నారని, వారంతా జగన్‌వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్‌కు మద్దతు ప్రకటించిన పేర్నినాని తన అనుచరులతో సోమవారం చల్లపల్లి మండలంలోని పాత మాజేరువద్ద వైఎస్‌ జగన్‌ను కలిశారు. జగన్ తో చాలా సేపు ఆయన మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X