చంద్రబాబు, వైయస్ రాజశేఖరరెడ్డి కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి

మాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమన్నారు. లాఠీఛార్జీలకు, తుపాకి గుళ్లకు భయపడేది లేదన్నారు. ప్రభుత్వం కేసులు ఎత్తివేస్తామంటూనే నాపై16 కేసులు పెట్టిందన్నారు. తెలంగాణ కోసం జైళ్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వైయస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నాలు చేశారని, వారిద్దరి దుర్మార్గం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications