విద్యార్థులపై కేసులకు నిరసనగా టిడిపి, బిజెపి, సిపిఐ సభ్యుల వాకౌట్

ప్రభుత్వ వైఖరిని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి నిరసించారు. విద్యార్థులపై పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తేయకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించకతప్పదని ఆయన అన్నారు. విద్యార్థులపై, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఇప్పటికే కొన్నింటిని ఎత్తేశామని, మిగతావాటిని కేసులవారీగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అయినా తెరాస సభ్యులు సంతృప్తి చెందలేదు. జైల్లోని విద్యార్థులను విడుదల చేయాలని, విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని తెరాస సభ్యులు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద గుమికూడారు. కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని సబితా ఇంద్రారెడ్డి చెప్పినా వారు వినలేదు.












Click it and Unblock the Notifications