చిరంజీవి, చంద్రబాబులకు వైయస్ జగన్ రాజకీయ పోటు

కాంగ్రెసు నుంచి తన వైపు సాధ్యమైనంత ఎక్కువ మంది ఆకర్షిస్తూనే వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది వైయస్ జగన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీకి కూడా వైయస్ జగన్ తీవ్రమైన తలనొప్పిగా పరిణమించారు. పలువురు రాష్ట్రస్థాయి నాయకులు కూడా వైయస్ జగన్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీకి భవిష్యత్తు లేదనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని ప్రత్యేకంగా బలహీనపరచాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. తాను పార్టీ పెట్టేలోగా ప్రజారాజ్యం పార్టీకి చెందినవారు తన వైపు వస్తారని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications