కృష్ణా జిల్లా సీనియర్ల చర్చ: వైయస్ జగన్ వైపా, కాంగ్రెసు వైపా?

YS Jagan
విజయవాడ‌: కృష్ణా జిల్లా కాంగ్రెసు సీనియర్ నాయకుల సోమవారం విందు భేటీ ఒక్కసారిగా మలుపు తిరిగింది. వైయస్ జగన్ వైపు వెళ్లాలా, కాంగ్రెసులోనే ఉండాలా అనే అంశంపై వారు మల్లగుల్లాలు పడినట్లు చెబుతున్నారు. దేవినేని నెహ్రూ నివాసంలో ఉదయభాను, మండలి బుద్ధప్రసాద్, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి సమావేశమయ్యారు. వైయస్ జగన్ వైపు కార్యకర్తలను, నాయకులను కట్టడి చేయడానికి కాంగ్రెసు అధిష్టానం సూచన మేరకు వీరు సమావేశమయ్యారని భావించినప్పటికీ అకస్మాత్తుగా జగన్ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ ప్రతినిధిగా సమావేశానికి వచ్చినట్లు భావిస్తున్నారు. కాగా, జగన్ వర్గానికి చెందిన నాయకులు అంబటి రాంబాబు, భూమా నాగిరెడ్డి ఎప్పటికప్పుడు వారితో ఫోన్ లో సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, సమావేశం తర్వాత మండలి బుద్ధప్రసాద్, ఉదయభాను చేసిన ప్రకటనలు మాత్రం వీరు జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుపుతున్నాయి. అయితే దేవినేని నెహ్రూ మాత్రం ఆ వార్తలను ఖండించారు. తాము కాంగ్రెసు పార్టీని వీడిపోయే ప్రసక్తి లేదని, తాజా రాజకీయాలపై మాత్రమే విస్తృతంగా చర్చించామని నెహ్రూ చెప్పారు. వైయస్ జగన్ వైపు వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ నెల 16వ తేదీన తన నియోజకవర్గం జగ్గయ్యపేట కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని మాజీ శాసనసభ్యుడు ఉదయభాను చెప్పారు. జగన్ వైపు వెళ్లాలా, వద్దా అనే విషయంపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

కాగా, రైతు సమస్యలపై ఎవరు పోరాటం చేసినా మద్దతిస్తానని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాటానికి తాను మద్దతిచ్చినట్లు ఆయన తెలిపారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం కాంగ్రెసుకు సవాలేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ రాజకీయం సంక్షోభం సృష్టిస్తుందని ఆయన చెప్పారు. మొత్తం మీద, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత జగన్ వైపు వెళ్లాలా, పార్టీలో ఉండాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని వారు అనుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+