అసెంబ్లీ వద్ద విద్యార్థుల అత్మహత్యాయత్నం, తీవ్ర ఉద్రిక్తత

విద్యార్థులు అత్యహత్యకు యత్నాలు చేయటంతో అసెంబ్లీ వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తమకు కోర్టు తీర్పు ద్వారా న్యాయం జరగదని, ప్రభుత్వమే కల్పించుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 70-30 శాతాన్ని మేం ఒప్పుకునేది లేదని, దీనివల్ల తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉద్యోగాలు పొందే అవకాశముందని అంటున్నారు. అందరికీ సమానావకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందుకు నిబంధనలు అడ్డుగా వస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications