శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం మంత్రుల కమిటీ ఏర్పాటు?

నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగితే ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశముందనే అంశంపైనా కేంద్రం బేరీజు వేస్తోంది. దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదికలు అందించింది. ఈనెల 29నే శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 30 లేదా 31న తన నివేదికను సమర్పిస్తుందని కమిటీ వర్గాలు చెప్పాయి.ఈ తేదీల్లో ఎప్పుడు నివేదిక ఇవ్వాలో కేంద్రమే సూచిస్తుందని తెలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం లేదా విభజించడం అనే అంశాలపైనే తమ నివేదికలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని కమిటీ సభ్యుడొకరు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. తమ నివేదికలో హైదరాబాద్ ప్రధానాంశంగా ఉండే అవకాశం లేకపోలేదని చెప్పారు. 'హైదరాబాద్ ప్రతిపత్తిపై ఒక కమిటీని నియమించాలనే ప్రతిపాదన కూడా చేయవచ్చు' అని వివరించారు.












Click it and Unblock the Notifications