బాబ్లీ నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు: చంద్రబాబు మండిపాటు

నేను ప్రభుత్వాన్ని గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినిగానీ వ్యక్తిగతంగా ఏమీ అనలేదన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చి పూర్తిగా నెలరోజులు కూడా కానందున ఆయనకు కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే నేను ఏమనలేదని, అయితే ముఖ్యమంత్రే దానిని నిలుపుకోవటం లేదన్నారు. మేం అధికారం కోసమే పోరాడుతున్నామన్నారు. ప్రజలకు చేయూతనివ్వని ఈ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారం కావాలని తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ముఖ్యమంత్రి సత్తా ఏమిటో తెలిసిందన్నారు. సామాజిక న్యాయం కూడా పాటించలేదన్నారు.
ఓ సమయంలో నిగ్రహం కోల్పోయిన ముఖ్యమంత్రి సిగ్గులేకుండా మాట్లాడకుడదని, నీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలని, చంద్రబాబుని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన న్యాయం ఏ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. మీకు మీరు చప్పట్లు కొట్టుకోవడం కాదని, రైతులు చప్పట్లు కొట్టేలా మనం పని చేయాలని చంద్రబాబుకు అన్నారు. ఆదర్శ రైతులు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలేనని విమర్శించారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయానికి, కాంగ్రెస్ హయానికి చాలా తేడా ఉందని, అప్పటి బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ కి కూడా తేడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయిందని, కాని రైతుల గురించి పట్టించుకోవటంలో విఫలమయిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం నిద్ర పోతుందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కోట్ల రూపాయలు దండుకున్నారని స్వయంగా కాంగ్రెస్ వారే చెబుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.
రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. అందుకే రాజకీయాలు మాట్లాడటం లేదన్నారు. రాజకీయాలు మాట్లాడదల్చుకుంటే చాలా మాట్లాడవచ్చన్నారు. సభ రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. ఇక్కడున్న మంత్రుల కంటే ఎక్కువ జిల్లాలు తిరిగి రైతుల పరిస్థితి కళ్లారా చూసానన్నారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తులను బతికించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి 33 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు మద్దతు ధర చెల్లించాలన్నారు. వరికి హెక్టారుకు 10వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర కమిషన్ లు నిర్దారిస్తే ప్రభుత్వం 6వేలు ఇచ్చి చంకలు గుద్దుకుంటుందన్నారు. కౌలు రైతులు పూర్తిగా నష్ట పోతున్నారన్నారు. ప్రభుత్వం చర్యలు రైతులకు ఉపయోగ పడేవి లేవన్నారు. తుఫాను, వాయుగుండం తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభుత్వ లెక్క ప్రకారం లక్షల కొద్ది ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications