శ్రీకృష్ణ కమిటీ టీ పార్టీకి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు డుమ్మా

మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ తో భేటీ అవుతారు. మధ్యాహ్నం కమిటీ అన్ని పార్టీలకు టీ పార్టీ ఇవ్వనుంది. అయితే కమటీ ఇచ్చే టీ పార్టీకి చంద్రబాబు నాయుడు హాజరు కావటం లేదు. ఆయన గురువారం సాయంత్రం అన్నదాతలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు. మొదట నిరహార దీక్ష తేదిని 17వ తారీఖున పెట్టుకున్నప్పటికీ తర్వాత దానిని 16వ తేదికి మార్చుకున్నారు.
శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్నందునే చంద్రబాబు తన నిరాహార దీక్షను 16వ తేదికి మార్చుకున్నారని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు బుధవారం ఆరోపించారు. కాగా మహాగర్జన నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే టీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు గైర్హాజరు కానున్నారు. తెరాస తరఫున ఆయన తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు రానున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.












Click it and Unblock the Notifications