మేం రోడ్డెక్కే పరిస్థితి తేవద్దు: రైతు సమస్యలపై అసెంబ్లీలో చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: వర్షం తాకిడి ప్రాంతాల్లోని రైతుల సమస్యలపై తాము రోడ్డెక్కే పరిస్థితి కల్పించవద్దని ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్ష నేత చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలను పక్కన పెట్టి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతు సమస్యలపై చర్చ సందర్భంగా ఆయన గురువారం ఈ విజ్ఞప్తి చేశారు. రైతులను, కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన సూచించారు. కేంద్రం నుంచి సాయం వస్తుందని ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర పార్లమెంటు సభ్యుల పరిస్థితి శోచనీయంగా ఉందని, కేంద్రం నుంచి సాయం తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని వర్షం తాకిడి ప్రాంతాల రైతులకు రాష్ట్రం 53 వేల కోట్ల రూపాయలు అడిగితే కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగామని ఆయన అన్నారు. రైతులకు హెక్టారుకు పది వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. మండలానికి ఒక్కటో రెండో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి, ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేయాలని, రైతులకు రూ. 200 చొప్పున బోనస్ ప్రకటించాలని ఆయన కోరారు. రైతులకు రాజకీయాలకు అతీతంగా భరోసా ఇద్దామని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసి ఉంటే రైతు మరణాలను ఆపి ఉండగలిగేవాళ్లమని, కనీసం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రైతు సమస్యలపై చర్చ చేపట్టిన గత 48 గంటల్లో జరిగిన ఎనిమిది మరణాలను ఆపి ఉండగలిగేవాళ్లమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+