వైయస్ జగన్ ఆస్తులపై ఐటి దాడులకు రంగం సిద్ధం?

వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా పెట్టుబడులపై, భారతి సిమెంట్స్ లో షేర్ల వ్యవహారంపై ఐటి శాఖ ప్రధానంగా దృష్టి పెట్టే అవకశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే రఘురాం సిమెంట్స్ వ్యవహారాలపై కూడా ఆరా తీసే అవకాశాలున్నాయి. వైయస్ జగన్ పవర్ ప్రాజెక్టులు కూడా ఐటి శాఖ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే వైయస్ జగన్ ముందస్తుగా కోట్లాది రూపాయలు ముందస్తు పన్ను చెల్లించారు. భారతీ షేర్ల వ్యవహారంలో ఏ విధమైన మతలబు లేదని ఆయన వివరణ ఇచ్చారు. తన కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ద్వారా ఎదురు దాడికి దిగుతూనే ఉన్నారు. తాను ప్రత్యక్షంగా మాట్లాడకుండా సాక్షి మీడియాలో వార్తాకథనాల రూపాల్లో వెల్లడి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications