జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానిని కోరాను: కిరణ్ కుమార్

తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉందని, వీలైనంత ఎక్కువ సాయం అందిస్తామని ఆయన చెప్పారు. గతంలో కురిసిన వర్షానికి జరిగిన నష్టానికి సంబంధించి కేంద్ర నిధులు రావాల్సి ఉందని, దాని కోసం ఒత్తిడి తెస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా సాయం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది తీసుకున్న రైతుల రుణాలపై వడ్డీని మాఫీ చేస్తున్నట్లు, వడ్డీ మాఫీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆయన చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ప్రజాప్రతినిధులంతా రైతుల కోసం నిలబడతామని శాసనసభ భరోసా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. 483 మండలాలను వర్షపీడిత ప్రాంతాలుగా గుర్తించామని, ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రాజకీయాలు తక్కువ చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉందని ఆయన చెప్పారు. వరికి హెక్టారుకు 6 వేల రూపాయలకు ఇన్ పుట్ సబ్సిడీని పెంచినట్లు ఆయన తెలిపారు. కేంద్రం 4 వేల రూపాయలు ఇస్తుందని, మరో రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications