చంద్రబాబుపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

రైతు సమస్యలపై శాసనసభలో చర్చించాలని అంటే చర్చించకుండా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారని, చంద్రబాబు ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదని ఆయన అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో బాబ్లీ యాత్ర చేపట్టారని, దాని వల్ల ప్రభుత్వంపై 20 లక్షల రూపాయల భారం పడిందని, ప్రజల డబ్బును చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను హైదరాబాదుకు విమానంలో తీసుకురావడానికి ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. రైతులు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కుంటుంటే రాజకీయం చేయడం సరి కాదని ఆయన అన్నారు. తాము వీలైనంత వరకు రైతులకు సహాయం చేస్తున్నామని, అయితే అది ఎక్కువ అని చెప్పడం లేదని, ఇంకా చేయాల్సి ఉందని, చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications