జగన్ మనుగడ కష్టమే, పర్యటనతో తేలిపోయింది: హర్షకుమార్

Harsha Kumar
రాజమండ్రి: కాంగ్రెసు పార్టీలో ఉంటే తప్ప ఏ నాయకుడికి అయినా మనుగడ ఉండదని బుధవారం నాటి మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు తూర్పుగోదావరి జగన్ పర్యటన స్పష్టం చేసిందని అమలాపురం పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెసు నాయకుడు హర్షకుమార్ గురువారం అన్నారు. జగన్ పార్టీలోనే ఉంటే ఆయనకు మంచి భవిష్యత్తు ఉండేదన్నారు. పార్టీని వీడటం ద్వారా ఆయన మంచి భవిష్యత్తును కోల్పోయాడన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన జనాలు లేక పేలవంగా ఉండటంతో హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు లో ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

వైయస్ జగన్ వర్గం నాయకులు జగన్ విమర్శించే అగ్రవర్ణాలను వదిలి కేవలం బలహీన వర్గాలనే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారన్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు జగన్ విమర్శిస్తున్నప్పటికీ జగన్ వర్గం వారిని పెల్లెత్తు మాట అనటం లేదన్నారు. బలహీనవర్గాలైన కాంగ్రెసు సీనియర్ నాయకులు కె కేశవరావు, శంకరరావు, వి హనుమంతరావులను విమర్శిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+