చంద్రబాబు ఊరు నారావారిపల్లెలో తేల్చుకుందాం: రఘువీరా

Raghuveera Reddy
హైదరాబాద్: రైతు సమస్యలపై గురువారం శానససభ దద్ధరిల్లింది. రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డి, తెలుగుదేశం సభ్యులు పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. రైతులకు తెలుగుదేశం కన్నా కాంగ్రెసు తక్కువ చేసిందని నిరూపిస్తే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని రఘువీరా రెడ్డి సవాల్ చేశారు. రైతు సమస్యలపై జరిగిన చర్చకు ఆయన గురువారం శాసనసభలో సమాధానమిచ్చారు. రఘువీరా రెడ్డి తన ప్రసంగంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘువీరా రెడ్డి సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. జల్ తుఫాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేశారు. రఘువీరారెడ్డి సమాధానం స్పష్టంగా లేదని వారు విమర్శించారు. రైతుల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో, ఇప్పటి తమ ప్రభుత్వం ఏం చేసిందో నారావారి పల్లెలో తేల్చుకుందామని ఆయన అన్నారు.

రైతులను తాము అన్ని విధాలా ఆదుకుంటామని రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. వర్షాల వల్ల 20 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఆయన చెప్పారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే కొనసాగుతుందని ఆయన చెప్పారు. మంగళగిరిలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఏర్పాటుకు కేంద్రం 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిందని ఆయన చెప్పారు. వరద బాధిత రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఆయన తెలిపారు. వరద తాకిడి ప్రాంతాల్లో నష్టం అంచనాకు రేపు, ఎల్లుండి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+