మహాగర్జనతో వరంగల్ గులాబీ మయం, వేడెక్కిన తెలంగాణ

వరంగల్ సభా ప్రాంగణానికి కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. ముంబై, సూరత్, ఔరంగాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. శ్రీకాంతాచారి ప్రాంగణం జనసముద్రమైంది. ఖమ్మం రోడ్డులో పోలీసులు వాహనాలను నిలిపేశారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ తరఫున తెలంగాణ ఎన్నారైలు కూడా సభకు వచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ప్రజలు వరంగల్ కు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications