వైయస్ జగన్ పై పోటీకి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి రెడీ

కడప జిల్లాకు చెందిన సహచర మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో శాసనమండలి ప్రాంగణంలో బుధవారం ఉదయం ఆయన కొద్దిసేపు మాటామంతీ జరిపారు. తర్వాత సాయంత్రం అదే చోట సహచర మంత్రులు డీఎల్, అహ్మదుల్లా, ఎమ్మెల్సీలు షేక్ హు స్సేన్, చెంగల్రాయుడు, ఎమ్మెల్యే వీర శివారెడ్డిలతో సమావేశమయ్యారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట జరిగే వివాహానికి హాజరయ్యేందుకు కాకినాడ వెళ్లినందున వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అమర్నాథరెడ్డి, కమలమ్మ, జీ శ్రీకాంత్, ఆదినారాయణరెడ్డిలు ఈ సమావేశానికి రాలేదు. అయితే వీరు ఇప్పటి వరకు వైయస్ జగన్ వెంటే ఉన్నారు. వీరు వివేకానంద రెడ్డితో ఉంటారా, లేదా అనేది అనుమానమే.
అయితే వారితో కూడా మాట్లాడి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ శాసనసభ్యులుగా పార్టీ అ భ్యర్థులను బలపరుస్తారో జగన్ వెంట నడుస్తారో స్పష్టం చేయాలని వివేకానంద రెడ్డి వారిని కోరనున్నట్లు సమాచారం. దీనివల్ల ఎవరెవరు ఏ వర్గానికి చెందినవారన్నది తేలితే ఆ మేరకు రాజకీయ వ్యూహాలను రూపొందించుకునే వీలుందని వివేకా అభిప్రాయపడుతున్నారు. జగన్‌ను నేరుగా ఢీకొట్టేందుకు వివేకా సిద్ధం కావడం చర్చనీయాంశమైంది. జగన్ తో బాబాయ్ ఢీ కొంటే వైఎస్ సతీమణి విజయమ్మపై వివేకా కుమార్తె పోటీ చేస్తారని సమాచారం. ఈ సమయంలో వివేకాకు పూర్తి సహాయ సహకారాలను అందించేందుకు సహచర మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా సన్నద్ధమవుతున్నారు. వీరశివారెడ్డి, షేక్ హుస్సేన్‌లు కూడా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications