మావోలతో చర్చలకు సిద్ధమన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్

Ravishnkar
శ్రీకాకుళం: ఏఐసిసి ప్రధాన కార్యదర్శికి హిందుత్వంపై అవగాహన లేక పోవడం వల్లనే హిందూ ఉగ్రవాదం అన్న వ్యాఖ్యలు చేశారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ శనివారం అన్నారు. రవిశంకర్ శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. హిందుత్వంపై అవగాహన ఉండి మాట్లాడితే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారికి అధ్యాత్మిక భావన కొరవడడమే కారణమన్నారు.
మావోయిస్టులను మంచివారిగా రవిశంకర్ అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పోరాడటంలో తప్పులేదన్నారు. అయితే వారు ఎంచుకున్న హింసామార్గమే బాగాలేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చొరవచూపితే ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్యన మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+