కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు: తాజాగా నలుగురు మృతి

armers committ suicide
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరి దశలో ఉన్న పంట అకాల వర్షాలతో దారుణంగా దెబ్బతినడం, పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చే దారి కనిపించకపోవడం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఆందోళనతో శనివారం రాష్ట్రంలో నలుగురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ముగ్గురు గుండెపోటుతో మరణించారు. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌ మండలం కుప్పన్‌కోట తండాకు చెందిన రాములు(35) సొంతంగా రెండెకరాలు ఉండగా, మరో ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఆయన రూ.50 వేల అప్పు చేశారు. భారీ వర్షాలతో కంది, వరి పంటలు దెబ్బతిన్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటను అడవి పందులు శుక్రవారం రాత్రి నాశనం చేశాయి. శనివారం పొలానికి వెళ్లి పంటను చూసిన ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పులు తీర్చే మార్గం తోచక అక్కడే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్‌ మండలం పులుమద్దికి చెందిన నల్ల గాలయ్య(45) రెండెకరాల్లో పత్తి, మొక్కజొన్న వేశారు. పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి కనిపించలేదు. గాలయ్యకు రూ.30 వేలు అప్పులున్నాయి. ఇవి తీరేదెలా అని మదనపడిన ఆయన ఉరేసుకుని మరణించాడు.

అతివృష్టివల్ల ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూరు మండలం భుతాయి(బి) గ్రామంలో కరాడ్‌ బాలు(35) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కౌలు రైతు కాకర్ల చిన నరసింహారావు(50) మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేయగా, వర్షానికి నీట మునిగింది. మిగిలిన పంటను కోసేందుకు కూలీలు దొరకలేదు. ఈ పరిణామాలతో కుంగిపోయిన ఆయన శనివారం పొలంలోనే పురుగుమందు తాగారు. ఇదే జిల్లా పడమటి మోరవాగుపాలెంకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి భార్య దొంతిరెడ్డి విజయలక్ష్మి(32) పంట నష్టం, అప్పులపై ఆందోళనతో శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

కృష్ణా జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు గుండెపోటుతో మరణించారు. వీరిలో వీరులపాడు మండలం అల్లూరువాసి కందుల వందనం(38), అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన గరికపాటి ప్రభాకర్‌(48) ఉన్నారు. ముదినేపల్లి మండలం దేవపూడి రైతు నారగాని పాండురంగారావు(22) పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కరీంనగర్‌ జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన అంబాల కిష్టయ్య(38) అనే రైతు గుండెపోటుతో మృతిచెందారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కృష్ణా జిల్లా రైతు తిరుపతిరావు మృతదేహంతో శనివారం విజయవాడలో తెదేపా ధర్నా నిర్వహించింది. బాధిత రైతు కుటుంబానికి తక్షణం న్యాయం చేయాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్‌ చేసింది. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరుకు చెందిన తిరుపతిరావు శుక్రవారం బలవంతంగా తనువు చాలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+