బెల్లంకొండ సునామీ.. 100 కోట్ల వ్యూస్ తో చరిత్ర సృష్టించాడుగా..!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూవీ 'జయ జానకి నాయక' ఈ మూవీ 2017లో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. బోయపాటి శ్రీను తనదైన శైలిలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ప్యూర్ లవ్ స్టోరీని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అలాగే ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, నందు, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

అయితే ఈ చిత్రం యూట్యూబ్ లో 'ఖూన్ ఖార్' అనే పేరుతో విడుదలైంది. యూట్యూబ్ లో ఈ మూవీ సంచలన రికార్డును నమోదు చేసింది. యూట్యూబ్‌ లో 100 కోట్ల వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించింది. యూట్యూబ్‌ లో రూ. 100 కోట్ల వ్యూస్ దాటిన తొలి ఇండియన్ డబ్బింగ్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ప్రశాంత్ నీల్- యశ్ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్-1' హిందీ వెర్షన్‌ ను అధిగమించి టాప్ ప్లేస్‌ లో నిలిచింది. 'కేజీఎఫ్ చాప్టర్-1' హిందీ వెర్షన్ కు 861 మిలియన్ల వ్యూస్‌ రాగా 'ఖూన్ ఖార్' చిత్రం ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్క్‌ ను దాటి సరికొత్త రికార్డు నెలకొల్పింది. బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్, సెంటిమెంట్ నార్త్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

Bellamkonda Sai Sreenivas Starrer Khoon-Khaar Achieves 1 Billion Views on YouTube Khoon Khaar movie

కేవలం 'జయ జానకి నాయక' మాత్రమే కాదు.. బెల్లంకొండ నటించిన అల్లుడు అదుర్స్, కవచం, సీత వంటి ఫ్లాప్ చిత్రాలకు కూడా హిందీ యూట్యూబ్ వెర్షన్లలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం విశేషం. అందుకే బెల్లకొండ సినిమాలకు నాన్- థియేట్రికల్ రైట్స్ కంటే కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే నిర్మాతలకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా బెల్లంకొండ శ్రీనివాస్‌ ను డైరెక్ట్ గా హిందీలో లాంచ్ చేశారు. వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఛత్రపతి'ని హిందీలో రీమేక్ చేయగా.. థియేటర్లలో అది భారీ డిజాస్టర్‌ గా మిగిలిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+