సూర్య చేతికి పాన్ ఇండియా ఫిల్మ్: హొంబలెతో బ్లాక్ బస్టర్ గ్యారంటీ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. ప్రతిష్టాత్మక చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించబోతోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను అందించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్నారు. టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కాయదు లోహర్ కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మధ్యాహ్నం ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటనను హొంబలే ఫిల్మ్స్ విడుదల చేసింది.
ఇది.. సూర్యకు 48వ సినిమా. కరుప్పు తర్వాత ఆయన నటిస్తోన్న నెక్ట్స్ మూవీ ఇదే కావడంతో హైప్ క్రియేట్ అయింది. అలాగే సూర్య- టీజే జ్ఞానవేల్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోండటం ఇది రెండోసారి. ఇదివరకు వీరిద్దరి కలయిలో జై భీమ్ తెరకెక్కింది. రజినీకాంత్ నటించిన వేటయ్యన్ కు కూడా జ్ఞానవేల్ దర్శకుడు. అద్భుతమైన సామాజిక కథాంశంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న జై భీమ్ తర్వాత ఇప్పుడు మళ్లీ సూర్య- జ్ఞానవేల్ రీయూనిట్ కావడం అటు అభిమానుల్లోనూ, ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విభిన్నమైన పాత్రలను ఎంచుకునే ఈ ముగ్గురి కలయిక దక్షిణాది సినీ రంగంలో మరో బ్లాక్ బస్టర్ కావడం గ్యారంటీ అనే అభిప్రాయాలు నెలకొన్నాయి. తమ బ్యానర్‌లోకి సూర్యను ఆహ్వానిస్తూ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఒక ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సూర్య తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారని మేకర్స్ గుర్తుచేశారు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్‌ను ఎంచుకోకుండా, సాహసోపేతమైన పాత్రలతో సమాజానికి నిజాలు చూపించిన నటుడిగా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆయనతో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతోన్నామంటూ హోంబలే ఫిల్మ్స్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అద్భుతమైన ట్యూన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యువ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎస్‌ఆర్ కదిర్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలను స్వీకరించాడు. అలాగే ఎడిటర్‌గా ఫిలోమిన్ రాజ్ ఎంపికయ్యారు. సాంకేతిక పరంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందనుంది.
The next chapter... #SuriyaXHombale
— Hombale Films (@hombalefilms) June 29, 2026
He built it.
Frame by frame. Film by film. Fight by fight.
Roles that bled truth.
Characters that carried the weight of real lives.
A journey defined by courage, conviction, and craft.
Three decades of truth on screen.
Countless hearts… pic.twitter.com/HoZOgQRbC7
సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ కంటే ముందే సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. వెంకీ అట్లూరి దర్శకుడు.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.












Click it and Unblock the Notifications