జగన్ ను మేం పంపించలేదు, ఆయనే రాజీనామా చేశారు: మొయిలీ

జగన్ మొదటిసారి ఓదార్పు చేపట్టినప్పుడే ఓదార్పు వద్దని అధిష్టానం హెచ్చరించినప్పటికీ ఆయన వినిపించుకోలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యపై, ఆయన ప్రభుత్వంపై, పార్టీపై విమర్శనలు చేసినప్పటికీ హెచ్చరికలతోనే విడిచిపెట్టామన్నారు. ఆలాంటి విమర్శలు చేయకుడదని సూచించినప్పటికీ ఆయన విమర్శలు కొనసాగించారని చెప్పారు. జూలై 19వ తేదిన రోశయ్యపై విమర్శలు వద్దన్నప్పటికీ ఆయన పెడ చెవిన పెట్టారన్నారు.
పార్టీపైన ఆయన ఆరోపణలు ఎక్కువవడం, జగన్ కు చెందిన సాక్షిలో వ్యతిరేక వార్తలు రావటంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పామని అయితే ఆయనను మాత్రం బయటకు పంపించలేదన్నారు. జగన్ మొదటినుండి అధిష్టానంపై వ్యతిరేకతనే ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications