చంద్రబాబు నిరాహార దీక్ష భగ్నం, అరెస్టు: నిమ్స్ లో కొనసాగింపు

తనను తీసుకెళ్లడానికి వీల్లేదంటూ చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలుమార్లు పోలీసులు విజ్ఞప్తి చేసినా బాబు మౌనం వహించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారి సబర్వాల్ చంద్రబాబు నచ్చజెప్పే యత్నం చేశారు. తన ఆరోగ్యం సరిగానే ఉందని తాను దీక్ష చేసేందుకు పోలీసులు సహకరించాలని బాబు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఎంత చెప్పినా బాబు వినకపోవడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. నిమ్స్ లో చంద్రబాబు దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసేందుకు ఆదివారం రాత్రి నుంచే ప్రయత్నాలు సాగించారు. మూడు సార్లు కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. రెండు సార్లు పోలీసులు లాఠీచార్జీ చేశారు.












Click it and Unblock the Notifications