వైయస్ జగన్ దీక్ష: చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్లాన్స్?

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నాయకులు అకస్మాత్తుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రైతు సమస్యలపై 48 గంటల పాటు చేపట్టే నిరాహార దీక్ష ప్రభావాన్ని బట్టి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టి మంధ్యతర ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని అంటున్నారు. అయితే, ఆచితూచి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై ఇతర పార్టీలతో చర్చించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. సిపిఎం, సిపిఐ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నప్పటికీ ఆ పార్టీలకు పెద్దగా శాసనసభలో బలం లేదు. అది ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో లేదు.

కాగా, వైయస్ జగన్ మంగళవారం నుంచి విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్నారు. వైయస్ జగన్ కు కాంగ్రెసు శాసనసభ్యులు మద్దతు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు రోజుల నిరాహార దీక్షకు వైయస్ జగన్ కు లభించే ఆదరణ ఎలా ఉంటుంది, ఎంత మంది శాసనసభ్యులు ఆయనకు మద్దతు పలుకుతారు అనే విషయాలపై ఈ రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికే సంసిద్ధమవుతారు కాబట్టి దాన్ని వాడుకుని వీలుగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కొంత మంది కూడా వైయస్ జగన్ కు సహకరించే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పరిస్థితి కలిసి వస్తే వాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+