చంద్రబాబు నాయుడిది రాజకీయ డ్రామా: మంత్రి దానం నాగేందర్

చంద్రబాబు పెట్టే డిమాండ్లు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. బషీర్ బాగ్ ఉదంతమే రైతులకు చంద్రబాబు వ్యతిరేకి అని చెప్పడానికి మంచి నిదర్శమన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెసు స్పందించినట్లుగా చంద్రబాబు ఎప్పుడూ స్పందించలేదన్నారు. హఠాత్తుగా బాబుకు రైతులపై ప్రేమ పుట్టికు రావడం పట్ల అందరూ ఆశ్చర్య పోతున్నారన్నారు. ఎక్స్ గ్రేషియా కోసమే రైతుల ఆత్మహత్యలన్న బాబు ఇప్పుడు వారికోసం దీక్ష అనటం హాస్యాస్పదమన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే రైతు సమస్యలపై స్పందించి అధిక సాయం విడుదల చేసిందని, బాబు ఎప్పుడైనా ఇలా చేశారా అని ప్రశ్నించారు. రైతు సమస్యలపై కాంగ్రెసు చిత్తశుద్దిపై ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. బాబు రైతుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రైతుల సమస్యల గురించి పోరాటం అని చెబుతూ నగరం నడిబొడ్డున దీక్ష చేపట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications