ప్రభుత్వం, స్సీకర్ లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తాం: టిడిపి నేతలు

ప్రభుత్వ అధికారిక పత్రాలు చూపకుండా చంద్రబాబు దీక్షను భగ్నం చేయడం దారుణమని సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆరోగ్యం బాగుంది దీక్షకు సహకరించమని చేతులు జోడించి అడిగినా పోలీసులు దీక్ష భగ్నం చేశారని మరో సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని ఎర్రన్నాయుడు కోరారు. చంద్రబాబును అరెస్టు చేసే విధానం ఎమర్జెన్సీని తలపిస్తోందని తెదేపా ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, కడియం శ్రీహరి, దేవేందర్‌గౌడ్, యనమల రామకృష్ణుడు తదితరులు నిమ్స్‌లో చంద్రబాబును పరామర్శించారు.












Click it and Unblock the Notifications