రైతులను ఆదుకోవాలని గవర్నర్ కలిసిన తెదేపా, లెఫ్ట్

అనంతరం రాజ్ భవన్ ముందు ఎర్రన్నాయుడు విలేకరులతో మాట్లాడారు. రైతులను ఆదుకోవడానికే చంద్రబాబు దీక్ష చేపట్టారన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందు తమ పార్టీ 20 డిమాండ్లు పెట్టిందన్నారు. అందులో ఒక్క డిమాండుకు కూడా ప్రభుత్వం స్పందించక పోవటం దారుణమన్నారు. వరి పంటకు ఎకరాకు పదివేల రూపాయలు, వాణిజ్య పంటలకు 15వేల రూపాయలు, ఇతర పంటలకు 12వేలు, చెరుకుకు 2500, పత్తికి 4500 రూపాయలు ఇవ్వాలని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నామమాత్రంగా ప్రకటించి చేతులు దులుపుకుంటుందన్నారు.
పంట నష్టపోయిన రైతులకు స్వామినాథన్ కమిటీ ఆధారంగానే నష్ట పరిహారం ఇవ్వాలని మేం కోరుతున్నామన్నారు. స్వామినాథన్ కమిటీ చంద్రబాబు వేసిందో, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయిగానీ వేసిన కమిటీ కాదన్నారు. అది సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ వేసిన కమిటీ అన్నారు. వారు వేసిన కమిటీ నివేదిక ప్రకారమే మేం డిమాండ్ చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications