చంద్రబాబు నిరాహార దీక్షతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది: అఖిలపక్షం

ఇంత వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. గత ఆరునెలలుగా కురిసిన వర్షాలతో తెలంగాణ రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. రైతాంగ విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోకూడదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతాంగ సమస్యలపై సరిగా స్పందించటం లేదన్నారు. చంద్రబాబును దీక్ష విరమించాలని కోరామన్నారు. ప్రభుత్వం మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలన్నారు. ముఖ్యమంత్రి అన్ని పార్టీలను తీసుకెళ్లి బాబు దీక్షను విరమింపచేయాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో రైతాంగ సమస్యలు తీరాలంటే రంగుమారిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేయాలని ప్రజారాజ్యం పార్టీ అన్నది. చంద్రబాబు దీక్ష వల్ల ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఆయన దీక్షను విరమించి ప్రజా సంక్షేమం దృష్ట్యా మరిన్ని సలహాలు ఇవ్వాలన్నారు. సాయాన్ని త్వరగా పంపిణీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. చంద్రబాబు వెంటనే దీక్ష విరమించాలని కోరారు.












Click it and Unblock the Notifications