2జి స్పెక్ట్రమ్ స్కామ్: సిబిఐ ముందు హాజరైన ఎ రాజా

సిబిఐ ముందు హాజరు కావడానికి రాజా తొలుత నిరాకరించారు. అయితే, చివరకు అందుకు అంగీకరించి వచ్చారు. దీంతో రాజాను విస్తృతంగా సిబిఐ ప్రశ్నించే అవకాశాలున్నాయి. స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారంలో రాజా పాత్రను కేంద్ర విజిలెన్స్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టారు. స్పెక్ట్రమ్ వివాదం రాజా తన మంత్రి పదవికి గత నెలలో రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజా బుధవారం రాత్రి చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తాను సిబిఐకి సహకరిస్తానని ఆయన ఆ సమయంలో చెప్పారు.












Click it and Unblock the Notifications