చలో సెక్రటరియేట్ ఆందోళనలో అరెస్టయిన ఎమ్మెల్యేలు విడుదల

Nagam Janardhan Reddy
హైదరాబాద్: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దీక్షను విరమింప చేయాలని తెదేపా, వామపక్షాలు చేసిన చలో సెక్రటరియేట్ ఆందోళనలో అరెస్టు చేసిన పలువురు శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను, కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు. శాసన సభ్యులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ తదితరులను పోలీసులు విడుదల చేశారు. ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి మాపై దౌర్జన్యం చేసిందని వారు ఆరోపించారు.

కాగా ప్రభుత్వం ప్రకటించిన సాయం రైతులకు ఏమాత్రం సమ్మతంగా లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు. నిత్యం పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యలను ఆపని సాయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని నాగం చెప్పారు. రైతులకు న్యాయం జరగడానికి అవసరమైతే జైళ్లకు వెళ్లడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి అయిన పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+