ఐసియులోకి తరలించి చంద్రబాబుకు బలవంతంగా చికిత్స చేస్తున్న వైద్యులు

Chandrababu Naidu
హైదరాబాద్‌: కోమాలోకి వెళ్లే స్థితి రావడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ప్రభుత్వం గురువారం రాత్రి నిమ్స్‌లోని ఐసీయూలోకి బలవంతంగా తరలించి, ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించింది. ప్రతిఘటించిన తెలుగుదేశం నాయకులను పోలీసులు గదిలోకి నెట్టి తాళంవేసి మరీ డాక్టర్ల చేత ఈ పని కానిచ్చేశారు. కుటుంబ సభ్యులను నెట్టేశారు. అయినప్పటికీ నిరాహారదీక్ష కొనసాగుతుందని తెలుగుదేశం నాయకులు చెప్పారు. శుక్రవారం చలో సెక్రటేరియట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిడిపి, వామపక్షాలు ప్రకటించాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్‌ భవన్‌లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తారు.

గురువారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం- ప్రభుత్వ ఏకపక్ష వైఖరి కారణంగా అపరిష్కృతంగా ముగిసింది. రైతులకు ఇదే మెరుగైన ప్యాకేజీ అని, ఇంకేమీ ఇవ్వబోమని కిరణ్‌కుమార్‌ ఖరాకండిగా చెప్పడంతో సమావేశం నుంచి టిడిపి, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు వాకౌట్‌ చేశారు. 'అఖిలపక్షం నిర్వహించమన్నారు, నిర్వహిస్తున్నాం...చెప్పండి' అంటూ కిరణ్‌ సమావేశ ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ విపక్షాలు బయటికి వెళ్లిపోయాయి. మిగిలిన పార్టీలతో సమావేశాన్ని కొనసాగించినా ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఏదీ ఇవ్వలేదు. కేంద్రంపై ఒత్తిడికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే విపక్షాల ప్రతిపాదనను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+