డిఎల్ రవీంద్రారెడ్డిని సవాల్ చేసిన జగన్ క్యాంప్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

DL Ravindra Reddy
హైదరాబాద్‌: తమ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దమ్ములుంటే డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయాలని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. వైయస్ జగన్ కడప పార్లమెంటు సీటుకు రాజీనామా చేశారని, డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా శాసనసభా స్థానానికి రాజీనామా చేసి మైదుకూరు నుంచి తిరిగి పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

వైయస్ జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసే డిఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని పొగడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబుతో డిఎల్ రవీంద్రారెడ్డి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ చలువుతో ఏర్పడిన ప్రభుత్వమని, వైయస్సార్ పథకాలను ప్రభుత్వం అమలు చేయకపోతే తాము రాజీనామా చేయడానికి వెనకాడబోమని ఆయన అన్నారు. రాజీనామా చేయవద్దని వైయస్ జగన్ చెప్పారు కాబట్టే తాము రాజీనామాలు చేయడం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ పై ఆరోపణలకు కెవిపి రామచందర్ రావు కలత చెందారని, కెవిపి కూడా జగన్ వెంట వస్తారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+