తెలుగుదేశం అధినేత చంద్రబాబును టార్గెట్ చేసిన వైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ లక్ష్యదీక్ష ఉద్దేశ్యానికి ఏదో మేరకు చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష గండి కొట్టినట్లే. దీంతో ఆయన చంద్రబాబుపై తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోయారు. లక్ష్యదీక్ష ముగింపు ప్రసంగంలో గురువారం ఆయన చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. చంద్రబాబుది దొంగ దీక్ష అని చెప్పడానికి ప్రయత్నించారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తుంటే రక్తంపోటు, షుగర్ లెవెల్స్ తగ్గలేదట అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న తీరుపై వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయి జగన్ దీక్షను దెబ్బ తీయడానికి దీక్షను పొడగిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు దీక్షను తప్పు పడుతూ గురువారం వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ తరుచుగా వార్తాకథనాన్ని ప్రసారం చేస్తూ పోయింది. చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ప్రతిపక్ష నాయకులు సాక్షి వార్తాకథనాన్ని నమ్మారో లేదో తెలియదు గానీ చంద్రబాబుకు పరామర్శల వెల్లువ పెరిగింది. ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో సహా తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ వరకు ఆయనను పరామర్శించారు. ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేశారు. అయితే, వైయస్ జగన్ అంతటితో ఆగలేదు. తాజాగా శుక్రవారం వెలువడిన సాక్షి దినపత్రికలో చంద్రబాబు దీక్ష స్కేచ్ ప్రకారమే జరిగిందంటూ దుమ్మెత్తిపోస్తూ ఓ వార్తాకథనాన్ని ప్రచురించారు. కడప జిల్లాలో తనకు అతి ముఖ్యమైన ప్రత్యర్థి అయిన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది. పథకం ప్రకారమే వైయస్ జగన్ దీక్ష ముగిసిన తర్వాత చంద్రబాబును ఐసియుకి తరలించారని, అది కూడా దొంగ దీక్ష బయట పడిన తర్వాతనే ఆ పనిచేశారని సాక్షి వార్తాకథనం ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+