వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా నాయకత్వం కిందికి కెసిఆర్ వస్తారు: సర్వే సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana
న్యూఢిల్లీ‌: తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం కింద పనిచేస్తారని, తెరాస పార్టీ ఉండదని, ఈ విషయం తాను మేడమ్ సోనియా గాంధీకి చెప్పానని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు నాయకులను కొట్టాలని అన్నటువంటి కెసిఆర్ అందరి నాయకుడని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులను చవటలు, దద్దమ్మలు అనవద్దని తాను కెసిఆర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. తెరాస ఎంత బలపడితే అంత త్వరగా తెలంగాణ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

2011 లోనే తెలంగాణ ఇవ్వాలని, లేదంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ వ్యతిరేకి అయిన తమ పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు రాజకీయ బ్రోకర్ అని ఆయన అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజకీయ జోకర్లు అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సుప్రీంకోర్టు తీర్పు కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X