అబ్బాయ్ వైయస్ జగన్ వెంటే బాబాయ్ వివేకానంద రెడ్డి?

YS Vivekananda Reddy
కడప‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డికి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మధ్య జరిగిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వైయస్ వివేకానంద రెడ్డి నుంచి శనివారం సాయంత్రంలోగా ఓ ప్రకటన వెలుడవే అవకాశం ఉందని భావిస్తున్నారు. జగన్ మామ గంగిరెడ్డి చొరవ తీసుకుని ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాతనే కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ తో ఉన్న విభేదాలను వైయస్ వివేకానంద రెడ్డి పరిష్కరించుకోవడానికి భేటీ వీలు కల్పించినట్లు చెబుతున్నారు. జగన్ తో ఉన్న ఆంతరంగిక సమస్యలన్నింటికీ సమావేశంలో సమాధానం లభించినట్లు చెబుతున్నారు. దీంతో వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ తో కలిసి నడవడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి కొంత కాలం మంత్రిగా కొనసాగుతారని తెలుస్తోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేసినప్పుడే వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా చేస్తారని అంటున్నారు. పార్టీ పెట్టడానికి ముందు లేదా కడప, పులివెందుల ఉప ఎన్నికలకు ముందు వారంతా రాజీనామా చేయవచ్చునని తెలుస్తోంది. వైయస్ జగన్ పార్టీకి చెందిన కడప జిల్లా పూర్తి బాధ్యతలు వివేకానంద రెడ్డికి అప్పగించేందుకు ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించే విషయంపై కూడా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. వైయస్సార్ ను విమర్సిస్తూ ప్రతిష్ట దిగజారుస్తున్న కాంగ్రెసు పార్టీలో ఉండడం సరి కాదని కుటుంబ సభ్యులు వైయస్ వివేకాకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వైయస్ జగన్ వెంట నడవడానికి ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+