గతి తప్పి జిఎస్ఎల్వీ-ఎఫ్6 విఫలం: నింగికెగిసిన 63 సెకండ్లలో కూల్చివేత

52 -63 సెకండ్ల మధ్య రాకెట్ అదుపు తప్పింది. జరగబోతున్న ప్రమాదాన్ని శాస్త్రవేత్తలు పసిగట్టారు. అదే క్షణంలో రెండు, మూడు దశలలో కంట్రోల్ గైడెన్స్ నావిగేషన్ తొలిదశలో ఉండే స్ట్రాపాన్ మోటార్లకు అందే సంకేతాలు ఆగిపోవడాన్ని గమనించారు. అదుపుతప్పిన రాకెట్‌ను షార్ రేంజ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీవాత్సవ, ఆకాశంలోనే పేలిపోయేలా ఆదేశాలిచ్చారు. దాంతో.. శ్రీహరికోటకు 8 కిలోమీటర్ల ఎత్తున 63 సెకండ్ల మేర ప్రయాణించిన రాకెట్ తునాతునకలైంది. అగ్ని గోళాల శకలాలు బంగాళాఖాతంలో పడిపోయాయి.
జీశాట్-5పీ ఉపగ్రహం కూడా తునాతునకలైపోయింది. జీఎస్ఎల్‌వీ రాకెట్ ఇలా తొలిదశలోనే విఫలం కావడం ఇదే ప్రథమం. శనివారం నాటి ప్రయోగంలో తొలి దశ 226 సెకండ్ల వరకు ఆకాశంలో 115 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా 8 కిలోమీటర్ల ఎత్తులోనే వెళ్లి 47 సెకండ్ల తర్వాత అదుపుతప్పింది. ఇదే వైఫల్యానికి ప్రధాన కారణంగా మారింది.












Click it and Unblock the Notifications