కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ఎంపీల సెగ: అహ్మద్ పటేల్ కు ఫోన్

పార్లమెంటు సభ్యులతో తాను మాట్లాడుతానని అహ్మద్ పటేల్ కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులపై పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ఈ దీక్షలేమిటని అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థులపై పెట్టిన కేసులను 26వ తేదీ లోగా ఎత్తేయాలని తాము అల్టిమేటం ఇచ్చామని, అయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వినలేదని, అందుకే దీక్ష చేస్తున్నామని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. తమ దీక్ష వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు రాదని మరో పార్లమెంటు సభ్యుడు కె. కేశవ రావు అన్నారు.












Click it and Unblock the Notifications