ఆందోళనకు సిద్ధమవుతున్న సీమాంధ్ర: రేపు జెఎసిల సమావేశం

నాగార్జున వర్సిటీలో మంగళవారం 14 విశ్వవిద్యాలయాల ఐకాసలు సమావేశం కానున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం జెఎసి నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత పరిస్థితులను సమీక్షిస్తామని చెప్పారు. సమైక్యాంధ్రపై సీమాంధ్ర ప్రజాప్రతినిధులెవరూ మాట్లాడడం లేదని, దీనిని సహించేది లేదని తెలిపారు. తెలంగాణ నేతలు ఎడతెగకుండా మాట్లాడుతుంటే సీమాంధ్ర నాయకులు మాత్రం మౌనం పాటిస్తున్నారని వారన్నారు.












Click it and Unblock the Notifications