మైక్రోసాఫ్టు లాటరీ పేరుతో టోకరా వేసిన ఆఫ్రికన్లు అరెస్టు
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధానిలో లాటరీల పేరిట 16 లక్షల రూపాయల వరకు మోసం చేసిన ముగ్గురు విదేశీయులను హైదరాబాదుకు చెందిన పోలీసులు దేశ రాజధాని న్యూఢిల్లీలో పట్టుకున్నారు. మైక్రోసాఫ్టు లాటరీ పేరుతో ముగ్గురు ఆఫ్రికన్లు హైదరాబాదులో పలువురిని ఆకర్షించారు. చీటీదారులనుండి సుమారు 16 లక్షల రూపాయలను వసూలు చేశారు. ఆ తర్వాత హైదరాబాదునుండి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఇక్కడినుండి నేరుగా ఢిల్లీ వెళ్లారు. బాధితులు పోలీసులకు మొర పెట్టుకున్నారు. రంగంలోకి దిగిన సీఐడి సైబర్ క్రైం పోలీసులు మోసానికి పాల్పడిన ఆఫ్రికన్లను ఢిల్లీలో అరెస్టు చేశారు.