విద్యార్థుల కేసులపై కాంగ్రెసు ఎంపీల దీక్ష మ్యాచ్ ఫిక్సింగ్: హరీష్ రావు

ఇదంతా తెలంగాణలో వారి క్రెడిబిలిటీ కోసమేనన్నారు. అయితే విద్యార్థులపై కేసులు ఎత్తివేసినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కేసుల ఎత్తివేత విషయంలో తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు పట్టుదలతో ఉన్నట్టుగా తెలంగాణ సాధన కోసమూ అలాగే ఉండాలన్నారు. తెలంగాణ సాధనకు నిలబడండి అని సూచించారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అంటున్న కాంగ్రెసు తెలంగాణ కోసం రాజీనామాకు కూడా సిద్ధం కావాలన్నారు. తెలంగాణ రాకుంటే రాజీనామా చేస్తామని స్వయంగా వారే ప్రకటించారని, దానికి వారు కట్టుబడి ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications