తెలంగాణ సాధన కోసం కేసిఆర్ తోనూ పని చేస్తాం: కెకె

తెలంగాణను, తెలంగాణవాసులను కించపరిచినప్పుడు మేం స్పందించామని దానిని అర్థం చేసుకోవాలని సీమాంధ్రులకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కథానాయకుడు ఎవరూ లేరని అంతా ప్రజా ఉద్యమమే అన్నారు. సమస్యను జఠిలం చేయవద్దని సీమాంధ్రులను ఆయన కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని సూచించారు. ఉద్యమకారులు భావోద్వేగాలతో కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమైనప్పటికీ అన్ని కేసులు ఎత్తివేయడంలో ఎలాంటి రాజీ లేదన్నారు. విద్యార్థులను మా ప్రకటనలు కూడా రెచ్చగొట్టి ఉంటాయని చెప్పారు.
ఐక్యమత్యంతో తెలంగాణను తప్పకుండా సాధిస్తామని చెప్పారు. మా ఆందోళనలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. మేం చిత్తశుద్దితో తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ కోసం తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కూడా తమకు సంఘీభావం తెలుపుతారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం కేసిఆర్ తో పని చేయడానికి వెనుకాడమని చెప్పారు.












Click it and Unblock the Notifications